ట్విట‌ర్ పోల్ : జ‌గ‌న్ అబ‌ద్ధాలే చెబుతారా ? వామ్మో !

-

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, జంగారెడ్డిగూడెంలో నాటు సారా మ‌ర‌ణాల‌పై జ‌గ‌న్ అన్నీ అబ‌ద్ధాలే చెబుతున్నార‌ని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. యాభై వేల మంది పైగా ఉన్న ఊళ్లో సారా ఎలా త‌యారు చేయ‌గ‌ల‌ర‌ని సీఎం ఎదురు ప్ర‌శ్న సంధించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.మ‌రి! ఇంత‌టి అన‌నుకూల వాతావ‌ర‌ణంలో కూడా ప్ర‌భుత్వం ఎందుకు వాస్త‌వ విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని? ఒక్క‌సారి చూద్దాం.

ప్ర‌శాంత గోదావ‌రి తీరంలో ఎప్ప‌టి నుంచో నాటు సారా త‌యారీ ఉంది.ఆ మాట‌కు వ‌స్తే ఉత్త‌రాంధ్ర ప‌ల్లెల్లో కూడా ఉంది. నాటు సారా త‌యారీ విక్ర‌యం తో పాటు ఇక్క‌డ చాలానే జ‌రుగుతున్నాయి. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు క‌ల్తీ సారా విక్ర‌యాలు బాగా పెరిగిపోయాయి. పోలీసుల దాడులకు వెళ్తే నిందితులు దాక్కుంటున్నారు. త‌రువాత మ‌ళ్లీ మాములుగానే త‌మ ప‌ని తాము కానిచ్చేస్తున్నారు. నాటు సారా త‌యారీ కి సంబంధించి ఒడిశా లో విప‌రీతంగా బృందాలు ప‌నిచేస్తున్నాయి.ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా తెలంగాణ వ‌ర‌కూ నాటు సారా ర‌వాణా జ‌రిగిపోతోంది.

గ‌తంలోనూ ఇందుకు భిన్నం అయిన ప‌రిస్థితులు ఏమీ లేవు. ఇక ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన దాడుల్లో ఐదు ల‌క్ష‌ల లీట‌ర్ల‌కు పైగా ఉన్న నాటు సారా బ‌ట్టీల‌ను పోలీసులు ధ్వంసం చేశారు.అయినా కూడా ఇది మూడ్నాళ్ల ముచ్చ‌టే ! మ‌ళ్లీ మ‌న ఆంధ్రా ప‌ల్లెల్లో నిషా త‌ప్ప‌దు. నాటు సారా త‌ప్ప‌దు. ప్ర‌భుత్వం అమ్ముతున్న మ‌ద్యం కన్నాత‌క్కువ ధ‌ర‌కే నాటు సారా వ‌స్తోంది.ఇదే అదునుగా క‌ల్తీ సారా ఇంకా విప‌రీతంగా అమ్ముడ‌యిపోతోంది.

వీటిని నియంత్రించ‌లేని యంత్రాంగం త‌రుచూ దాడులు అంటూ హ‌డావుడి చేయ‌డమే త‌ప్ప సాధించిందేమీ లేదు. ఈ ద‌శ‌లో క‌ల్తీ సారా తాగాక 18 మంది మ‌ర‌ణించారు జంగారెడ్డి గూడెంలో! ఇంకా ఈ మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంద‌ని వైద్యులు కూడా చెబుతున్నార‌ని టీడీపీ ఆందోళ‌న చెందుతోంది.అయినా కూడా విష‌యాన్ని రాజ‌కీయాల‌కు అనుగుణంగా వైసీపీ మారుస్తుందే త‌ప్ప త‌క్ష‌ణ ప‌రిష్కారం చూప‌డం లేదు.ఈ ద‌శ‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న స్థాయిని మ‌రిచి అబ‌ద్ధాలు చెప్ప‌డమే ఇప్ప‌టి విషాదం.క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌ను స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రించ‌డం ఇంకా విచార‌క‌రం. వీటిపై నిజాయితీతో పాల‌క‌ప‌క్షం స్పందిస్తే ఎంత బాగుండు.

Read more RELATED
Recommended to you

Latest news