టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన గంటా…!

-

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం విశాఖ వాసులకు కూడా ఇష్టం లేదని గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిగా చంద్రబాబు ప్రకటించారని, అలాంటి విశాఖకు అభివృద్ధి ఎందుకని, అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు టిడిపి నేతలు కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని,

అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందని అలాంటి విశాఖకు అభివృద్ధి ఎందుకు అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు టిడిపి నేతల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదని వైసీపీ నేతలకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన నియోజకవర్గమైన విశాఖ ఉత్తరం నుంచి ఆయన ఎటువంటి సహకారం అందించడం లేదని కనీసం అక్కడ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన తల దూర్చడం లేదని సమాచారం.

ఇప్పుడు ఇది టిడిపి ఇబ్బందికరంగా మారింది. మూడు రాజధానులను ప్రజలు స్వాగతించడం లేదు అనే విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పాలి అంటే కచ్చితంగా విశాఖ జిల్లాలో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఎక్కువ మున్సిపాలిటీలను అదేవిధంగా పంచాయతీలను కూడా టిడిపి గెలవాలి. అలా జరిగితేనే టిడిపికి కాస్త ఉపశమనం. విశాఖ మేయర్ కూడా గెలవాలి. ఈ తరుణంలో గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి షాక్ ఇవ్వడం టిడిపి కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయనతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news