టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఒంటరి వారవుతున్నారనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించే నాయకులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేల సంఖ్య కూడా మరింతగా పడిపోయింది. త్వరలోనే మరో నలుగురు, అది కూడా విశాఖ నుంచే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా త్వరలోనే పోతుందని అంటున్నారు. ఇక, సీనియర్లు, సం స్థాగతంగా సైకిల్‌పైనే కొన్ని దశాబ్దాలు తిరిగిన వారు, రాజకీయాలు చేసిన వారు కూడా పార్టీ మారిపోయా రు.
ఇలాంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపైనా, వైసీపీ అధినేత జగన్‌పైనా విమర్శ లు చేయడం వల్ల వచ్చే లాభం ఏమీలేదని అంటున్నారు పరిశీలకులు. నిజానికి పార్టీలు మారుతుండ డం, జెం డాలు మార్చుతుండడం అనేది నాయకులకు పరిపాటే అయినప్పటికీ.. ఇలా కీలక సమయంలో కీలకమైన నాయకులు చంద్రబాబు హ్యాండివ్వడం అనేదే చర్చకు దారితీస్తోంది. మరి ఈ సమయంలో నాయకులకు భరోసా ఇవ్వాల్సిన చంద్రబాబు.. జగన్‌పై విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారు. అంతో ఇంతో న్యాయస్థానాల పరంగా చంద్రబాబుకు ఊరట లభిస్తోంది.
దీంతో ఆయన ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. కానీ, పార్టీలో మాత్రం ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. నిజానికి ఇప్పటి వరకు పార్టీ మారిన వారిని పరిశీలిస్తే.. అందరిపైనా కేసులు ఉన్నాయని చెప్పలేం. అలాగని కేసులు ఉన్న వారంతా కూడా పార్టీలు మారిపోలేదు. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు. మాజీలు కూడా టీడీపీ నుంచి బయటకు వస్తున్నారు వీరు చెబుతున్నదంతా కూడా చంద్రబా బుపై తమకు నమ్మకంలేదని, పార్టీకి భవిష్యత్తు లేదని. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు అసలు పార్టీలో ఏం జరుగుతోంది? అనే విషయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు. ఇప్పుడు ఉదాశీనంగా వ్యవహరిస్తే.. మొత్తానికే నష్టం వస్తుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.