బీజేపీకి జిహెచ్ఎంసి మేయర్ సవాల్.. నిరూపిస్తే చెవులు కోసుకుంటా !

-

GHMC మేయర్ విజయ లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసారు. నా ఛాంబర్ లోని వస్తువులను బీజేపీ కార్పొరేటర్లు ద్వంసం చేయలేదు…వారి వెంట కార్యకర్తలు ద్వంసం చేశారని నిప్పులు చెరిగారు మేయర్ విజయ లక్ష్మి. నేను అందరికి అందుబాటులో ఉంటున్నా- నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు.

నేను కార్పొరేటర్లకు అందుబాటులో లేను అన్నారు కాబట్టి నేనే జోన్ లు తిరుగుతున్నానని స్ఫష్టం చేశారు మేయర్ విజయ లక్ష్మి. జోన్ల పర్యటన తరువాత అధికారులు- కార్పొరేటర్లను జోన్ల వారిగా మాట్లాడించి గ్యాప్ పిల్ చేస్తానని పేర్కొన్నారు.

బీజేపీ కార్పొరేటర్లను కలవడం లేదు అని అనేది అవాస్తవం. నేను కలవలేదు అంటే చెవులు కోసుకుంటానని సవాల్ విసిరారు. నేను అందరిని కలు పుకొని వెళ్తున్నాను…రేపు 18న జరగబోయే కౌన్సిల్ సమావేశం మీరే చూస్తారన్నారు. కాగా… గత వారం రోజుల కింద బీజేపీ పార్టీ కార్యకర్తలు…g h mc ఆఫీస్ లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news