ఈ సంవత్సరం రాఖీకి మీ సిస్టర్స్‌కు వారి రాశిచక్రం ప్రకారం బహుమతి ఇవ్వండి..!

-

ఒకప్పుడు ఎమోషనల్‌ ఫెస్టివల్‌గా ఉండేది.. ఇప్పుడు కమర్షియల్‌ ఫెస్టివల్‌ అయిపోయింది..ఈ మాట మేము అనడం లేదండోయ్.. పబ్లిక్‌ టాక్. అదే రాఖీ. ఏది ఏమైనా.. ఇది అన్నాచెల్లెల్లకు, అక్కాతమ్ముళ్లకు మధ్య బంధాన్ని తియ్యని వేడుక. సోదురుడి క్షేమం కోసం సోదరీమణులు రాఖీ కడతారు. అప్పుడు ఎంతో కొంత నగదు లేదా బహుమతిని అన్నలు, తమ్ముళ్లు ఇస్తుంటారు. అదే వారి రాశిచక్రం ప్రకారం.. వారికి ఈ సంవత్సరం ఎలాంటి బహుమతి ఇవ్వాలో తెలుసుకుని ఇస్తే ఇంకా బాగుంటుంది కదా..! సోదురుడి రాశి చక్రం ప్రకారం ఎలాంటి రాఖీ కట్టాలో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇప్పుడు సోదరి రాశిచక్రం ప్రకారం ఎలాంటి బహుమతి ఇవ్వాలో చూద్దాం.!

మేషం :

మీ సోదిరిది మేషరాశి అయితే ఆమెకు చెవిపోగులు, పెండెంట్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. కుజుడు మేష రాశికి అధిపతి కాబట్టి రెడ్ కలర్ డ్రెస్ కూడా ఇవ్వొచ్చు.

వృషభం :

వృషభ రాశి సోదరికి వెండి రంగు లేదా తెలుపు బహుమతి ఇవ్వండి. ఈ రంగులు వారికి అదృష్ట రంగు.

మిథునం :

మిథునరాశి వారికి ఆకుపచ్చ రంగు బహుమతులు ఇవ్వవచ్చు. క్రిస్టల్ జువెలరీ, గ్రీన్ కలర్ డ్రెస్ వంటివి బహుమతిగా ఇవ్వవచ్చు.

కర్కాటక రాశి :

మీ సోదరిది కర్కాటకరాశి అయితే.. మీరు ఏ బహుమతి ఇచ్చినా, దానితో పాటు తెల్లటి డెజర్ట్ కూడా చేర్చండి.

సింహం :

మీ సింహరాశి సోదరికి పసుపు లేదా కుంకుమను బహుమతిగా ఇవ్వండి.

కన్యా రాశి :

కన్యా రాశి ఉన్న సోదరికి బహుమతులతో పాటు గణేశ విగ్రహాన్ని ఇస్తే, అది ఆమెకు అదృష్టాన్ని కలిగిస్తుంది.

తుల :

తులారాశి సోదరికి మీరు సౌందర్య సాధనాలను బహుమతిగా ఇవ్వండి.

వృశ్చికం :

వృశ్చికరాశి సోదరి కోసం ఏదైనా మెటల్ నగలు, ఎరుపు రంగు దుస్తులు బహుమతులుగా ఇవ్వవచ్చు.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి బంగారు నగలు, పసుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వవచ్చు. దీనితో పాటు పసుపు రంగు షో పీస్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.

మకరం :

మకర రాశి వారికి కానుకలతోపాటు ఇనుముతో చేసిన షోపీస్ కూడా బహుమతిగా ఇస్తే ఇంకా మంచిది.

కుంభం :

క్రిస్టల్ జ్యువెలరీ లేదా కిచెన్ వస్తువులను బహుమతులుగా ఇవ్వండి. వారికి ఆసక్తి ఉన్న అంశాలను బహుమతిగా ఇచ్చి వారి పనికి మీ నిరంతర మద్దతును ఉండండి.

మీనం :

మీన రాశి సోదరికి స్పటిక నగలు, రాగి వస్తువులు బహుమతిగా ఇవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news