షాకింగ్ సర్వే  –  అందంగా లేకపోయినా పరవాలేదు అలాంటి అబ్బాయి చాలు..!!!

-

మీరు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే నాకు పలానా సినిమా హీరోలా ఉండాలి, పలానా హీరో బాడీ లా కండలు ఉండాలి. ఎత్తుగా ఉండాలి, తెల్లగా , ఎంతో గంభీరంగా ఉండాలి అంటూ రకరకాలుగా ఉండాలి అంటూ కొంతమంది అంటుంటారు. అయితే అదంతా గతంలో మాట ఇప్పుడు మీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం వింటే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే. ఓ సంస్థ చేసిన సర్వేలో మీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మెచ్యూర్డ్ గా ఆడపిల్లలు ఆలోచన చేస్తున్నారు అనాల్సిందే అంటున్నారు.

Related image

అమెరికాకి చెందిన ఓ సంస్థ ఆన్లైన్ లో చేపట్టిన సర్వే లో దాదాపు చాలా దేశాలకి చెందిన 17 నుంచీ 35 ఏళ్ళ లోపు అమ్మాయిలు పాల్గొన్నారట. మగవారిలో మీరు ఏమి చూసి ఇష్టపడుతారు అని అడిగిన ప్రశ్నకి దాదాపు అందరూ అందం అనే విషయాన్ని పక్కన పెట్టారట. సుమారు 90 శాతం మంది తమకి మగవారిలో అందం, రంగు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యమని తేల్చి చెప్పారట.

హడావిడి చేస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు అని అనుకుంటారు కానీ మాకు ముఖ్యమైనది సెన్సాఫ్ హ్యుమర్ అని బల్ల గుద్దిమరీ చెప్పారట. మగవాళ్ళు మాట్లాడే విధానం చతురత బట్టి వారిని ఇష్టపడుతారట. నాలుగు మంచి మాటలు చెప్పడం, నవ్వించడం, తోడుగా ఉన్నామనే నమ్మకాన్ని ఇవ్వడం వంటివి వారి మాటల్లో చేతల్లో మహిళలకి ఇట్టే తెలిసిపోతుందట. ఈ కారణాలే తమకి మగవారిపై ఇష్టాన్ని పెంచేస్తాయని అంటున్నారు. ముభావంగా ఉండేవారు, కోపంగా ఉండేవారు శృంగారంలో సైతం తుస్సు మంటారని అలాంటి వారిని అస్సలు మహిళలు దగ్గరకి కూడా రానివ్వరని ఈ సర్వేలో తేలిందట.

Read more RELATED
Recommended to you

Latest news