శివుడి ముందు మోకాళ్ల మీద కూర్చున్న మేక.. వీడియో వైరల్..

-

శివుడు దేవతలకు అధిపతి.. అన్ని జీవులకు కూడా ఆయన ముఖ్యం.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు.. ఇది అక్షర సత్యం..అందుకే కొన్ని ప్రానులు శివాలయాలకు వెళ్ళి మరీ దేవుడిని మొక్కుతాయి.ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం మనం చూస్తున్నాము.. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. జంతువులు మనుషుల లాగానే దేవుళ్లను ప్రార్థించడం చూస్తుంటాం. ముఖ్యంగా కుక్కలు, కోతులు ఆలయంలో దేవుడికి దండం పెట్టుకోవడం గతంలో చూశాం..

తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. శివాలయంలో గర్భగుడి ఎదుట మోకాళ్ల మీద కూర్చుని తల వంచుకుని ప్రార్థనలు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఆనందేశ్వర్ మందిరానికి భక్తుల తో పాటు ఓ మేక కూడా వచ్చింది. ఆ మేక ను చూసి మొదట అందరు షాక్ అయ్యారు.. కాసేపు తర్వాత మేక చేసిన పనికి ఆశ్చర్యానికి గురైయ్యారు..

గర్భ గుడి ముందు మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న ఇతర భక్తుల తో పాటు తను కూడా మొక్కుంది. ఆ మేక భక్తికి అక్కడున్న వారు షాకయ్యారు. దాదాపు ఆ మేక గంట పాటు అలానే ఉందని అక్కడి భక్తులు చెబుతున్నారు. అది శివుడి లీల అని మరికొందరు అంటున్నారు.. వెంటనే ఆ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version