GodFather : అనంతపురంలో గాఢ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ !

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘లూసిఫర్ ‘ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది.


ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో జరగబోతున్న ఈ సినిమాలో సల్మాన్ మాఫియా డాన్ గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. గాఢ్ ఫాదర్‌ సినిమా నుంచి బిగ్‌ సర్‌ ప్రైజ్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ అనంతపురంలో జరుగనుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అలాగే..ఈ రోజు నుంచి వరుసగా మూడు పాటలు విడుదల చేయనున్నారట. 25న ట్రయిలర్‌ రిలీజ్‌ చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news