ఈనెల 28న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే ?

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్, టీజర్, “తార్ మార్ తక్కర్ మార్” అంటూ సాగే పాట మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి.

ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రకటించారు.

ఈనెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించారు. మొదట హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనంతపురం ని వేదికగా ఎంచుకొని ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ఈ బుధవారం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అని చిత్ర బృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news