ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్నికలు మరో పది రోజుల్లో పూర్తవుతాయని భావించిన తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయంగా జగన్ ని కట్టడి చేయడానికే ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ప్రక్రియ వాయిదా పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎంత వరకు సమంజసం అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సుప్రీం కోర్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే, కరోనా ఉంది కాబట్టి ఎన్నికల సంఘం నిర్ణయం సమంజసం అనే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సంఘ౦ తీసుకున్న నిర్ణయం వెనుక కరోనా వ్యాప్తి అనే కారణం ఉంది.
దేశం మొత్తం వైరస్ వ్యాప్తి ఉంది. కాబట్టి ఎన్నికలను నిర్వహించాలి అని సుప్రీం కోర్ట్ ఆదేశించే పరిస్థితి లేదు. ఎలాగూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను అడిగే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు రమేష్ కుమార్. కాబట్టి సుప్రీం కోర్ట్ ఈ అధికారాలను ఎన్నికల సంఘానికే నిర్ణయ అధికారం వదిలేసే అవకాశం ఉందని అంటున్నారు. వెళ్ళినా ఫలితం లేదు అనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతుంది. మరి ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.