పసిడి ప్రియులకు షాక్.. బంగారం ఆల్ టైమ్ రికార్డ్..!

-

పసిడి ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంతో ఒక వైపు వినియోగం పడిపోయినా.. ధరలకు మాత్రం ఎక్కడా బ్రేక్ లేదు. శ్రావణమాసం పెళ్లిళ్లకు సీజన్. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పైకి కదిలింది. దీంతో ధర రూ.55,310కు చేరింది.

gold

ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.50,740కు ఎగసింది. అలాగే కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.66,050కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పైకి కదిలింది. రూ.51,500కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.250 పెరుగుదలతో రూ.52,700కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.50 పెరుగుదలతో రూ.66,050కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news