Rana Naidu: రానా నాయుడు క్రేజీ అప్డేట్.. బాబ్బాయి, అబ్బాయిల‌ షూటింగ్ షూరూ!

-

Rana Naidu: బాహుబలి భళ్లాల దేవ రానా దగ్గుబాటి, సూపర్ స్టార్ విక్ట‌రీ వెంకటేష్ లతో కాంబినేషన్ లో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. బాబాయ్ అబ్బాయ్ లు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న డ్రామా సిరీస్‌కు ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో తెరకెక్కించేందుకు సిద్దమైంది నెట్ ఫ్లిక్స్. అమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా ఈ సిరీస్ రాబోతుంది. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

ఈ యాక్షన్ సిరీస్ లో రానా నాయుడు జీవిత కథ ఉండబోతుంద‌ని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ హక్కులను వయకాయ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రీబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌టకు వ‌చ్చింది. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌ల‌కు ప‌ని చేసిన‌ సుప‌న్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమాన్ ఈ షోను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సిరీస్ షూటింగ్ బుధ‌వారం ప్రారంభ‌మైన‌ట్టు తెలిపారు మేక‌ర్స్‌. చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్స్ లో ఎవ‌రు న‌టిస్తున్నారో ప్ర‌స్తుతానికి స‌స్పెస్స్ గా ఉంచారు నిర్మాత‌లు. రానా నాయుడు ప్రాజెక్టుతో బాబ్బాయి, అబ్బాయిలు ఏవిధంగా ఆక‌ట్టుకున్నారో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలాఉంటే.. వెంక‌టేశ్ ఎఫ్ 3 చిత్ర షూటింగ్ బిజీబిజీగా ఉన్నారు. మ‌రోవైపు రానా.. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం తెర‌కెక్కిస్తున్న విరాట ప‌ర్వం, అలాగే సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ భీమ్లా నాయుక్ చిత్రాల్లో న‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news