భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

-

గత మూడు వారాలుగా భారీగా క్షీణిస్తూ వచ్చిన బంగారం ధర భారీగా పెరిగింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర  216 రూపాయలు పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44,910 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 పెరగడంతో కేజీ ధర రూ.64,000కి పుంజుకుంది. ఢిల్లీ మార్కెట్‌‌లో గత రెండు వారాలుగా తగ్గిన బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి.

నేటి మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,330కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర రూ.47,060కి ఎగసింది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.508.00 (1.06%) పెరిగి రూ.48,300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,194.00 వద్ద ప్రారంభమై, రూ.48,559.00 వద్ద గరిష్ఠాన్ని, రూ.47,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.566.00 (1.18%) ఎగిసి రూ.48,484.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,097.00 ప్రారంభమైన ధర, రూ.48,640.00 వద్ద గరిష్ఠాన్ని, రూ.47,771.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

 

Read more RELATED
Recommended to you

Latest news