ఆదివారం గొల్లపూడి భౌతికకాయానికి అంత్యక్రియలు..

-

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూతపై టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ప్రతిభాశాలికి నివాళులర్పిస్తున్నారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.

అయితే చెన్నైలో మృతి చెందిన గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామ‌ని ఆయ‌న కుమారుడు మీడియాకు తెలిపారు. చెన్నైలోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో గొల్లపూడి ఈరోజు మృతి చెందారు. మ‌రియు ఇవాళ, రేపు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచనున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. చెన్నైలోని నివాసానికి గొల్లపూడి భౌతికకాయాన్ని శనివారం తరలిస్తామ‌ని.. శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news