అమరావతి : ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు సీఎం జగన్. ఇక అంతకు ముందు ఉద్యోగులకు లేదా కుటుంబ సభ్యులకు కరోనా సోకితే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్.
కరోనా సోకితే సెలవులివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. కాగా… ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3175 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1900028 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 29 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 12844 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35, 325 యాక్టివ్ కరోనా కేసులు న్నాయి.