అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. 50 శాతం డిస్కౌంట్‌!

-

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ (amazon prime) వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 50 శాతం పే చేసి.. ఏడాది మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇది వరకు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందాలంటే రూ.999 చెల్లించాల్సి ఉండేది. అప్పుడే సంవత్సరం మొత్తం ప్రైమ్‌ చిత్రాలు చూసే అవకాశం ఉండేది. అయితే, ప్రైమ్‌ తాజా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌తో కేవలం 50 శాతం అంటే..రూ.499 కే పొందొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మ్యూజిక్‌ యాక్సెస్‌ లభిస్తుంది. అమెజాన్‌ కొత్త యువ కస్టమర్లను ఆకట్టుకునేందుకే ఈ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీని కోసం కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ప్లాన్‌ మీరు పొందాలనుకుంటే మీ వయస్సు 18–24 మధ్య ఉండాలి.

 అమెజాన్‌ ప్రైమ్‌ /amazon prime
అమెజాన్‌ ప్రైమ్‌ /amazon prime

ఈ పొందడానికి అర్హులైనవారు ముందుగా రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. అది ఏడాదికి వర్తిస్తుంది. ఆ తర్వాత వారికి రూ.500 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇది కేవలం ఏడాది చందాదారులకే కాదు. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి కూడా వర్తిస్తుంది. అంటే కేవలం రూ.164 ధరకే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. సాధారణంగా ఇతర యూజర్లు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ కి రూ.329 చెల్లించాలి.దీనికోసం వయస్సు ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్‌ కార్డ్, పాన్‌ కార్డ్, ఓటర్‌ ఐడీ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్‌ వంటి డాక్యుమెంట్స్‌తో పాటు ఒక సెల్ఫీ అప్‌లోడ్‌ చేయాలి. ఈ వయస్సు ధ్రువీకరణ పూరై్తన తర్వాతే క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌ ఖాతాలో క్రెడిట్‌ అవుతుంది. మూడు నెలల మెంబర్‌షిప్‌ తీసుకున్నవారికి రూ.165 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇలాంటి ఆఫర్‌ను అమెజాన్‌ గతంలో కూడా ప్రకటించింది. కానీ, ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ప్లాన్‌లను మార్చుకుంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే ఉంది. అంటే డెస్క్‌టాప్‌లో అమెజాన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి ఈ ఆఫర్‌ పొందడం సాధ్యం కాదు. ఐఓఎస్‌ యూజర్లకు కూడా ప్రస్తుతం ఈ ఆఫర్‌ లేదు. ఈ ప్లాన్‌తో అమెజాన్‌ ప్రొడక్ట్స్‌ ఆర్డర్‌ చేస్తే ఫ్రీ డెలివరీ పొందే సౌలభ్యం కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news