ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ శుభ‌వార్త‌..ఇండ్లు లేని వారికి రూ.35 వేల రుణాలు !

-

ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మ‌రో శుభ‌వార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు రూ. 35 వేలు అదనంగా రుణాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అదనపు రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకునేందుకు వీలు కల్పిస్తూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రుణానికి 3 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప్రభుత్వం.

jagan
jagan

మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్ర‌భుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ఇక జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యం తో.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు ఎప్పుడు రుణ ప‌డి ఉంటామ‌ని చెబుతున్నారు ల‌బ్ది దారులు.

Read more RELATED
Recommended to you

Latest news