3 రోజుల్లోనే 173 కోట్లు క్రాస్‌..2021లోనే తొలి సినిమాగా పుష్ప రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా తెర‌కెక్కిన తాజా సినిమా పుష్ప‌. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించ‌గా.. బ‌న్నీ స‌ర‌స‌న ర‌శ్మిక మందాన హీరోయిన్ గాన‌టించింది. అయితే.. ఈ సినిమా డిసెంబ‌ర్ 17 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల అయింది. ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావ‌డంతో… జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా వ‌సూళ్ల లోనూ అదిరి పోయే రికార్డు ను క్రియేట్ చేసింది. విడుద‌ల మూడు రోజుల్లోనే..ప్ర‌పంచ వ్యాప్తంగా.. రూ. 173 కోట్లు వ‌సూలు చేసి..చ‌రిత్ర సృష్టించింది పుష్ప సినిమా. మూడు రోజుల్లోనే.. రూ. 173 కోట్లు రాబ‌ట్టిన పుష్ప సినిమా… 2021 సంవ‌త్స‌రం గ్రాస‌ర్ ఆఫ్ ది మూవీ గా చ‌రిత్ర సృస్టించింది. ఇక ఈ సినిమా విజ‌యంవంతంగా కొన‌సాగుతూనే ఉంది. కాగా.. మ‌రో రెండు రోజుల్లోనే.. ఈ సినిమా స‌క్ సెస్ మీట్ ను తిరుప‌తి నిర్వ‌హిస్తుంది చిత్ర బృందం.