గ్యాస్ సిలెండర్ వాడే వారికి గుడ్ న్యూస్…కీలక ప్రకటన చేసిన కేంద్రం..!

-

గ్యాస్ సిలెండర్ ని ఉపయోగిస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. పైప్డ్ ఎల్‌పీజీ సరఫరాను వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. ఈ విషయం కేంద్రం చెప్పింది.
పైప్డ్ గ్యాస్ విస్తరణ ప్రణాళికలు రెడీ అయ్యాయని అంది.

అయితే దీనిలో భాగంగా భారత భూభాగంలో 82 శాతానికి పైగా ప్రదేశంలో పైప్డ్ గ్యాస్ అందుబాటులోకి రానుందని తెలిపారు. మే 12న పైప్డ్ గ్యాస్ విస్తరణ పనులకు బిడ్లను ఆహ్వనించనున్నట్లు చెప్పారు. బిడ్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం కొంత సమయం పడుతుంది అని అన్నారు.

11వ రౌండ్ బిడ్డిండ్ తర్వాత దేశంలో 82 శాతం భూభాగంలో పైప్డ్ గ్యాస్ అందుబాటులోకి వస్తుందని.. జనాభాలో 98 శాతం మందికి పైప్డ్ గ్యాస్ లభిస్తుందని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ పైప్ లైన్ సిస్టమ్స్ ఈశాన్య ప్రాంతం, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉండకపోవచ్చు. సిలిండర్ల ద్వారా సరఫరా చేసే గ్యాస్ కన్నా పైప్‌డ్ ఎల్‌పీజీ చౌక.

పైగా ఇది అనుకూలంగా ఉంటుంది. 1000 వరకు ఎల్‌ఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందిట. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్లకు హోల్ సెల్ రేట్లలో డీజిల్‌ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రేటులో డీలర్ కమిషన్ వంటివి ఉండవని చెప్పడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news