మన రూపాయికి ఈ దేశాల్లో ఎంత విలువుందో..డాలర్ మారకపు వాల్యూ కంటే ఎక్కువే..!

-

చాలా దేశాల్లో కరెన్సీ కంటే యూఎస్ డాలర్ విలువ ఎక్కువగా ఉంటుంది. డాలర్ తో పోలీస్తే..మన రూపాయికి విలువ 75రూపాయిలు ఉంది. అంటే అక్కడ ఒక్క డాలర్ ఇక్కడ 75తో సమానం. కానీ మన రూపాయి కొన్ని దేశాల్లో ఎంతో విలువ ఉంది తెలుసా..డాలర్ టూ రూపీ కంటే..ఎక్కువే..100రూ. పైనే విలువ ఉందట. అక్కడి కరెన్సీ కంటే..మన రూపాయి విలువే ఎక్కువట. ఆశ్యర్యంగా ఉంది కదూ.. ఆ దేశాలేంటో, అక్కి కరెన్సీ విలువకు మన రూపాయి ఎంత ఎక్కువో ఇప్పుడు చూద్దాం.

వియత్నాం

దక్షిణాసియాలో ఉండే వియత్నాం దేశంలోనే… ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. ఇక్కడ అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే సంస్కృతి, నోరూరించే వంటలు సందర్శకులను బాగా ఆకర్షిస్తాయి.. కాగా మన ఒక్క రూపాయి ఇక్కడ 305.71 వియత్నాం డాంగ్‌ గా ఉంది. అంటే ₹100.. వియత్నాం కరెన్సీలో 30,570.95 డాంగ్‌లతో సమానం. మనకున్న డబ్బుతో అక్కడే ధనవంతులు అవ్వొచ్చేమోకదా..!

ఇండోనేషియా

అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండోనిషియా ఒకటి. ఇక్కడ పురాతన హిందూ, బౌద్ధ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఇండోనేషియన్‌ రుపియా. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 193.01 రూపియాలు. అంటే మన దగ్గర ₹100 ఉంటే, ఇండోనేషియాలో 19,301.24రుపియాలు ఉన్నట్లు.

ఉజ్బెకిస్థాన్‌

ఇస్లామిక్‌ దేశాల సరసన ఉన్న ఉజ్బెకిస్థాన్‌లో ఆధునిక భవనాలతోపాటు 17వ శతాబ్దం నాటి నిర్మాణాలు, సాంస్కృతిక కట్టడాలు కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఇస్లామిక్‌ శైలి కట్టడాలు, మసీదులు దర్శనమిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఉజ్బెకిస్థానీ సోమ్‌. మన రూపాయి విలువ అక్కడ 144.22సోమ్స్‌గా ఉంది. అంటే ₹100 ఉంటే, ఉజ్బెకిస్థాన్‌లో 14,422.17 సోమ్స్‌ తో సమానం.

లావోస్‌

థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ దేశాలకు పొరుగున ఉండే లావోస్‌లో చాలావరకు అంతర్జాతీయ సదస్సులు జరుగుతాయి..ఈ దేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాలు, జలపాతాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. లావోస్‌ కరెన్సీ లావోటియన్‌ కిప్‌. మన ఒక్క రూపాయి.. 140.72లావోటియన్‌ కిప్‌తో సమానం. అంటే భారతీయ కరెన్సీ ₹100కి లావోస్‌ కరెన్సీలో విలువ 14,071.72.

పరాగ్వే

ఈ దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. సముద్రమార్గం లేకపోయినా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నావికాదళం ఉన్న దేశంగా ఈ దేశం పేరుగాంచింది. ఈ దేశపు కరెన్సీ పరాగ్వేనియన్‌ గ్వారాని. ఒక రూపాయితో పోలిస్తే గ్వారాని మారకం విలువ 92.86గా ఉంది. అంటే మన ₹100.. అక్కడి దేశ కరెన్సీలో 9,286.03 గ్వారానిలతో సమానం.

కాంబోడియా

చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ వస్తోన్న ఆసియా దేశం కాంబోడియా. ఇది మంచి పర్యాటక దేశం కూడా..ఇక్కడి చారిత్రక నిర్మాణాలు, మ్యూజియాలను చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. ఆ దేశ కరెన్సీ కాంబోడియన్‌ రియల్స్‌ కాగా.. మన రూపాయితో పోలిస్తే ఆ దేశ కరెన్సీ మారకం విలువ 54.89గా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ₹100 ఉంటే, కాంబోడియా కరెన్సీలో 5,488.51రియల్స్‌తో సమానం.

కొలంబియా

పర్యాటకంగా ఈ దేశం అంతగా అనువైనది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయట. ముఖ్యంగా మనుషుల్ని అపహరిస్తుంటారు. అందుకే ఇక్కడ పర్యటించేవారిని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుంటారు. కాగా.. ఈ దేశ కరెన్సీని కొలంబియన్‌ పెసోగా పిలుస్తారు. ఒక రూపాయి విలువ అక్కడ 52.20 పెసోలుగా ఉంది. అంటే ₹100 ఉంటే, అది 5,219.61 పెసోలతో సమానం.

మంగోలియా

ఈ దేశం ఒకప్పుడు మంగోలుల సామ్రాజ్యంగా ఉండేది. చైనా, రష్యా దేశాలతో సరిహద్దును పంచుకుంటూ మధ్యలో ఉండే మంగోలియా దేశానికి గొప్ప చరిత్ర ఉంది. చెంఘీజ్‌ఖాన్‌ రాజ్యాన్ని స్థాపించి చైనా, రష్యాలో అనేక ప్రాంతాలను తన కైవసం చేసుకున్నాడు. కాలక్రమంలో తిరిగి చైనా, రష్యా తమ ప్రాంతాలను సొంతం చేసుకోగా.. ప్రస్తుతం మంగోలియా ఒక దేశంగా మిగిలిపోయింది.. ఈ దేశపు కరెన్సీ మంగోలియన్‌ టగ్రిక్‌. మన భారత కరెన్సీ ఒక రూపాయితో పోలిస్తే.. మంగోలియన్‌ టగ్రి మారకం విలువ 38.49గా ఉంది. అంటే ₹100.. మంగోలియా కరెన్సీలో 3,849 టగ్రిలతో సమానం.

దక్షిణ కొరియా

దక్షిణ కొరియా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ ప్రపంచంతో పోటీ పడుతోంది. ఈ దేశంలో సినిమాలు, కె-పాప్‌ సంగీతం, ఫ్యాషన్‌, టెక్నాలజీ రంగం, కాస్మోటిక్‌ సర్జరీలు చాలా పాపులర్‌. ఈ దేశపు కరెన్సీ సౌత్‌ కొరియన్‌ వాన్‌. ఇక్కడి ఒక్క సౌత్‌ కొరియన్‌ వాన్‌తో రూపాయి మారకం విలువ చూస్తే.. ఒక రూపాయి 15.93వాన్‌లతో సమానం. అంటే ₹100 ఉంటే దక్షిణ కొరియా కరెన్సీలో 1592.50 వాన్‌ ఉన్నట్లు.

ఇవే కాకుండా.. భారత రూపాయి విలువ చిలీ కరెన్సీలో 10.94, శ్రీలంక కరెన్సీలో 2.72, పాకిస్థాన్‌ కరెన్సీలో 2.29, నేపాల్‌ కరెన్సీలో 1.60తో సమానంగా ఉంది.కరెన్సీ విలువలు 07-11-2021 తేదీ ప్రకారం మారకపు విలువలు అందించటం జరిగింది. గమనించగలరు. మన రూపాయికి వివిధ దేశాల్లో ఇంత విలువు ఉందా..మనలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదేమో కదా.!.

Read more RELATED
Recommended to you

Latest news