పీఎఫ్‌ ఖాతాదారులకి గుడ్ న్యూస్..త్వరలోనే ఈ ప్రయోజనం..!

-

పీఎఫ్‌ ఖాతాదారులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రాబోయే కొద్ది రోజుల్లో 2022 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ఖాతాకు 8.1 శాతం వడ్డీని జమచేయబోతుంది. ఈ డబ్బు పీఎఫ్ పరిధిలోకి వచ్చే దేశంలోని దాదాపు 7 కోట్ల మంది ఉద్యోగుల ఖాతాలకు బదిలీ అవుతుంది..ఇప్పటికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీని గుణించే ప్రక్రియని పూర్తి చేసింది. జూన్ 16 నుంచి చందాదారుల ఖాతాల్లో డబ్బు జమ అవడం ప్రారంభమవుతుంది..

ఈ మేరకు ప్రతి 2.5 లక్షల నుంచి 5 లక్షల మందు ఖాతా దారులకు వడ్డీ జమ కానుంది.మొత్తం రూ.72,000 వేల కోట్ల సబ్‌స్క్రైబర్లకు వడ్డీ జమ చేస్తారు. గతేడాది ఈ మొత్తం రూ.70,000 కోట్లు.2021 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని పొందడానికి చాలా మంది చందాదారులు చివరిసారిగా 6 నుంచి 8 నెలల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ EPFO 22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్లను 8.1 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించింది.

గత ఆర్థిక సంవత్సరంలో 2019-20, కేవైసీ కారణంగా చాలా మంది చందాదారులు డబ్బు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. మీ పిఎఫ్ బ్యాలేన్స్ ను ఇలా చెక్ చేసుకోవచ్చు..

ఆన్‌లైన్ లో చెక్ చేసుకోవడానికి ముందుగా.. 

EPFO వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

epfindia.gov.in లో ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే

passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

ఇక్కడ మీరు మీ వినియోగదారు పేరు (UAN నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్‌ చేయాలి.

వివరాలను నింపిన తర్వాత మీరు కొత్త పేజీలోకి వెళుతారు. ఇక్కడ సభ్యుల IDని ఎంచుకోవలసి ఉంటుంది.

మీరు E-పాస్‌బుక్‌లో మీ EPF బ్యాలెన్స్‌ని సులువుగా చెక్ చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news