షూటింగ్ సమయంలో ప్రమాదం.. జబర్దస్త్ అదిరే అభికి తీవ్ర గాయాలు

-

అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్ ‘ చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అభి యాంకర్ గా, డాన్సర్ గా, స్టాండప్ కమెడియన్ గా పనిచేస్తూ ప్రస్తుతం జబర్దస్త్ సూపర్ హిట్ స్కిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరోవైపు సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. 2002 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నాడు అభినయ కృష్ణ.

తాజాగా తను ప్రధాన పాత్రలో ఓ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్ లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్రగాయాలయ్యాయి. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు పదిహేను కుట్లు పడ్డాయి అని చిత్ర యూనిట్ లోని ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news