ఫోన్ పే యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..

-

ఈరోజుల్లో ఎక్కువగా డిజిటల్ ద్వారా ఆన్‌లైన్ పే చేయడం చేస్తున్నారు. అయితే, వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం కొత్త కొత్త పథకాలను, అలాగే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే స్క్రాచ్ కార్డులను కూడా అందిస్తున్నారు. భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం పెట్టుబడుల విషయంలో మంచి శుభవార్త చెప్పింది. అదేంటంటే ఫోన్- పే ద్వారా ఇకపై వినియోగదారులు సిప్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటును కల్పించింది.

ఇలా చేయడం ద్వారా వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని ఇంటి వద్ద కూర్చునే కొంత మెుత్తంలో సొమ్ము పెట్టుబడి పెట్టడం ద్వారా పొందవచ్చు. వినియోగదారులు పెట్టుబడికి సమానమైన విలువ గల బంగారాన్ని ఎంఎంటీసీ- పీఏఎంపీ, సేఫ్ గోల్డ్ నిర్వహిస్తున్న బ్యాంక్‌-గ్రేడ్ లాకర్లలో భద్రపరుస్తారు.తాజాగా తెచ్చిన ఈ సదుపాయం వల్ల వినియోగదారులు కేవలం రూ.100 నుంచి తమ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీనికి తోడు ప్రతి రోజు బంగారం ధరలను ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది. ఇలా చిన్న మెుత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రేటుకు బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఇలా చెల్లింపు చేసినదానికి గాను సమకూరిన బంగారాన్ని వినియోగదారులు ఎప్పుడైనా విక్రయించవచ్చు లేదా గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్, బార్స్ రూపంలో ఎప్పుడైనా ఇంటికి తెప్పించుకోవచ్చు.. ఇందు కోసం ముందుగా ఫోన్ పే
గోల్డ్ సిప్ ఆప్షన్ ఎంచుకొని, నెలవారికి ఎలా పే చేయాలో ఎంచుకోవాలి..ఆపై సిప్ కాలం, తేదీ సెలెక్ట్ చేసుకుంటే తరువాత ఆ డబ్బు ప్రతి నెల అకౌంట్ నుంచి ఆటోమెటిక్ గా కట్ అవుతుంది..ఇలా చేయడం వల్ల మనకు ఒక సేఫ్టీ ఉంటుంది. చాలా వరకూ ఇలా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news