సెప్టెంబర్ నుంచి ప్రతీ నెల 4 వందేభారత్ రైళ్లు ప్రారంభం: అశ్విని వైష్ణవ్

-

సెప్టెంబర్ నుంచి ప్రతీ నెల నాలుగు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రకటించారు. జాతీయ రైల్వే అవార్డు ప్రధానోత్సవంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వేలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రతీ నెల 4-5 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని అన్నారు. బుల్లెట్ రైళ్ల కోసం కూడా పనులు జరుగుతున్నాయని అన్నారు.

భారత దేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ నుంచి వారణాసికి ప్రారంభించారు. ఆ తరువాత మరో రైలును న్యూఢిల్లీ నుంచి వైష్ణోదేవి కట్రాకు నడుపుతున్నారు. మరో రెండు వందే భారత్ రైళ్లను ఆగస్టు నాటికి తీసుకువస్తామని అన్నారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారవుతున్నాయి. వీటి తయారీ చివరి దశలో ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 పెద్ద పట్టణాలను కలుపుతూ 75 కొత్త వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. వందే భారత్ దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు కావడం గమనార్హం. రైలు పరీక్ష వేగం గంటకు 180 కి.మీ కాగా, గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.

Read more RELATED
Recommended to you

Latest news