రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్..ఇంట్లో కూర్చోనే తప్పులను సరి చేసుకోవచ్చు..!

-

ప్రస్తుత కాలంలో రేషన్ కార్దులో మార్పులు చెయ్యాలన్నా కొత్త రేషన్ కార్డును పొందాలన్నా పెద్ద సమస్యగా మారింది.దానికోసం సంభందిత కార్యాలయాల చుట్టూ తిరగాలి..కానీ ఇప్పుడు అలా శ్రమ పడాల్సిన అవసరం లేదు..సులువుగా మీ ఇంట్లోనే కూర్చోని మీ సమాచారాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు..ఈ విషయం పై ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక కార్డుదారుల ఇక్కట్లు తీరనున్నాయి.

జిల్లాలో 4.78 లక్షల రేషన్‌ కార్డుదారులున్నారు. వీరిలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉండేవారు ఉన్నారు. వీరు తరచూ మారడం ఒక మండలం నుంచి మరో మండలానికి ఉపాధి నిమిత్తం వెళ్లడం జరుగుతోంది. ఈక్రమంలో కార్డుల్లో చిరునామా మార్చుకోవడానికి అవకాశంలేకపోవడంతో ప్రధానంగా ప్రభుత్వ పథకాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఇప్పటికే సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వేల మంది కార్డుల్లో తమ ఇంటి చిరునామా మార్పు కోసం అర్జీలు సైతం అందజేసి ఉన్నారు..అయితే అవి ఎప్పుడూ అప్డేట్ అవుతాయో అని ఎదురుచూడటం తప్ప ఏమి చేయలేము..

ప్రభుత్వం రేషన్‌కార్డుల్లో ఉన్న చిరునామా మార్పు కోసం అవకాశం కల్పించింది. దీంతో మొన్నటి వరకు దీనికోసం ఎదురు చూపులు చూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది. ప్రస్తుతం కార్డుదారులు తాము నివాసం ఉంటున్న పరిధిలోని వార్డు, గ్రామ సచివాలయాలకు వెళ్లి కార్డులో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ సమయంలో ఆధార్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలు అందజేయాలి. దీంతో పాటు నివాసం ఉంటున్న వివరాలు సమర్పించాలి. ఆధార్‌లో పాత చిరునామా ఉంటే ముందుగా దాన్ని ఆధార్‌ కేంద్రానికి వెళ్లి మార్చుకున్న తరువాతే సచివాలయంలో దరఖాస్తు చేయాలి. సచివాలయ సిబ్బంది వివరాలను అప్‌లోడ్‌ చేయడంతో కొత్త చిరునామాతో తహసీల్దార్‌ లాగిన్‌కి వెళుతోంది..అలా ఎమ్మార్వొ ఆఫీస్ నుంచి కొత్త చిరునామాతో రేషన్ కార్డును పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news