రేపు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన

అమరావతి : రేపు తిరుపతి లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరీ పర్యటించ నున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఈ పర్యటన లో పరామర్శించనున్నారు నారా భువనేశ్వరీ. అంతే కాదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున రూ. లక్ష ఆర్థిక సాయాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నారు నారా భువనేశ్వరీ. 48 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు నారా భువనేశ్వరీ.

అయితే అసెంబ్లీ ఘటన అనంతరం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. నారా భువనేశ్వరి పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా గత నెలలో… చంద్రబాబు నాయుడు అలాగే ఆయన భార్య పై అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే లు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు.. ప్రెస్ మీట్ పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సైతం రంగంలోకి దిగి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది.