ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందజేసింది. అర్హులైన వారందరికీ పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్ అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశాడు. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు. కొత్తగా 1,09,155 మంది వితంతు పెన్షన్ (రూ.4 వేలు) పొందడానికి అర్హత కలిగి ఉన్నారు.

అర్హులైన వారికి ఆగస్టు నెల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనికి రూ. 43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసిందని శ్రీనివాస్ తెలియజేశారు. దీంతో ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల పథకాలు అమలులోకి వచ్చాయని ఇప్పుడు పెన్షన్లను పంపిణీ చేయడంతో మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.