తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..నిన్ లో భారీగా ఉద్యోగ అవకాశాలు..పూర్తి వివరాలు..

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మరో ప్రభుత్వం సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పటికే పలు కంపెనీలకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది.తాజాగా మరో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.భారత ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ లోని ఐసీఎంఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్)లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

గతంలో ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్థీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్ లో గతంలో ఉన్న ఖాళీలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పీజీ డిగ్రీల్లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి..

అభ్యర్థుల ఎంపికను ఇంటర్వ్యూ ఆధారంగా చేయనున్నారు.. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000 ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అడ్రస్: కాన్ఫరెన్స్ హాల్ అండ్ కమిటీ రూమ్, ఐసీఎమ్ఆర్, నిన్, హైదరాబాద్. ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 4, 2022 గానిర్ణయించారు..ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను నిన్ వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోగలరు.. ఈ ఏడాది ప్రభుత్వ సంస్థలలో ఎక్కువ ఉద్యోగాలను విడుదల చేసినట్టుగా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు..

Read more RELATED
Recommended to you

Latest news