నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో లక్ష జాబ్స్..పూర్తి వివరాలు..

-

దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్ ను చెప్పారు.ఇండియన్ రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు..ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య భారత రైల్వేలో 3,50,204 మందికి ఉద్యోగం లభించిందన్నారు.

ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా 1.4 లక్షల ఉద్యోగాలు రైల్వేలో భర్తీ కానున్నట్లు చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రైల్వేలో 18 వేల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించామన్నారు. రైల్వే అనేది భారీ సంస్థ అని అన్నారు. పదవీ విరమణలు, రాజీనామాలు, మరణాల కారణంగా నిత్యం భారీగా ఖాళీలు ఏర్పడుతుంటాయన్నారు..వాటిని వెంటనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు..

కాగా,రైల్వేలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు, పరీక్షకు హాజరైన తరువాత అప్లికేషన్ ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న జెండర్ గ్యాప్‌ను తగ్గించేందుకు, అలాగే రైల్వే సర్వీసుల్లో మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రైల్వేస్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం, భారతీయ రైల్వేలోని వివిధ విభాగాల్లో మొత్తం ఉపాధిలో మహిళల భాగస్వామ్యం కేవలం 7.87% మాత్రమేనని చెప్పారు..

రైల్వేలోని ఇతర విభాగాలతో పోలిస్తే కొంచెం పెరిగింది. అయితే రైల్వేలో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 3న లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాల ప్రకారం.. రైల్వేలోని వివిధ విభాగాల్లో 12,52,347 మంది ఉద్యోగుల్లో కేవలం 98,540 మంది మహిళా ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. మార్చి 2021 నాటికి, భారతీయ రైల్వేలో మొత్తం ఉద్యోగలు 12,52,347 మంది కాగా, అందులో మహిళా ఉద్యోగుల సంఖ్య 98,540..రైల్వేలో మహిళల సంఖ్య పెంచేందుకు ఇలా ప్రయత్నం చేశారని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news