విజయ డైరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
లీటర్ గేదె పాల ధర రూ.46.99 నుంచి రూ.49.40కు, ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాల్లోకి వచ్చిందని వివరించారు.