మహిళలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.8,500 : రాహుల్ గాంధీ

-

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతీ పేద కుటుంబం నుంచి ఒక మహిళకు నెలకు రూ.8500 అందించనున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. 25 మంది ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని తెలిపారు. అంగన్ వాడీలు, ఆశావర్కర్ల జీతాలను రెట్టింపు చేస్తానని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే.. కులగణన చేస్తామన్నారు.

కులగణన జరిగితే నిజమైన రాజకీయం మొదలవుతుందన్నారు రాహుల్ గాంధీ. ఎంత సొమ్ము అయితే నరేంద్ర మోడీ కోటీశ్వరులకు, ధనవంతులకు ఇచ్చారో అంత సొమ్మును పేదలకు బ్యాంకుల్లో వేస్తాను. దేశంలోని పేదలందరి లిస్ట్ తయారు చేస్తామన్నారు. ప్రతీ కుటుంబం నుంచి ఒక మహళకు రూ.1లక్ష ఏడాదికి జమ చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి నాయకులు.. మా టీమ్ అంతా మీ కోసం పని చేస్తుందని తెలిపారు. మేము అధికారంలోకి రాగానే రైతురుణమాఫీ మొదటిపని చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news