కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ..!

-

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు హుజూర్ నగర్ నుంచే బీఆర్ఎస్ కి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ.. శ్రీకాంత చారి లాంటి 1000 మంది కాలి మాంసపు ముద్దలుగా మారి ఉడుకుతుంటే చూసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది.  ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శంకరమ్మ.. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారు. దీంతో భువనగిరి రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకోని భావించారు. అన్ని రాజకీయ పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని కూడా ప్రకటించారు.   కానీ పోటీకి మాత్రం దూరంగానే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చనే ప్రచారం గతంలో జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news