గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు.. ఇలా అప్లై చేసుకోండి…

-

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ బ్లైండింగ్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది HPCL. HR ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, లా ఆఫీసర్ మరియు మేనేజర్/సీనియర్ మేనేజర్ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్ట్‌లకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు HPCL అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం – జూన్, 23

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ-జూలై 22

ఖాళీల వివరాలు..

మెకానికల్ ఇంజనీర్ – 103

ఎలక్ట్రికల్ ఇంజనీర్ – 42

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ – 30

సివిల్ ఇంజనీర్ – 25

కెమికల్ ఇంజనీర్ – 7

ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్ – 5

సెక్యూరిటీ ఆఫీసర్ UP – 6

సెక్యూరిటీ ఆఫీసర్ TN – 1

సెక్యూరిటీ ఆఫీసర్ కేరళ – 5

సెక్యూరిటీ ఆఫీసర్ గోవా – 1

ఫైర్ & సేఫ్టీ ఆఫీసర్ – 2

క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ – 27

బ్లెండింగ్ ఆఫీసర్ – 5

చార్టర్డ్ అకౌంటెంట్ – 15

హెచ్ ఆర్ ఆఫీసర్ – 8

వెల్ఫేర్ ఆఫీసర్ విశాఖ రిఫైనరీ – 1

వెల్ఫేర్ ఆఫీసర్ – ముంబై రిఫైనరీ – 1

లా ఆఫీసర్ – 5

లా ఆఫీసర్ – 2

మేనేజర్ / సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ – 3

విద్యార్హతలు..

వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి విద్యార్హతల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. 25-37 ఏళ్లు వయస్సు ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు..

దరఖస్తు ఫీజు.. 

UR, OBC & EWS అభ్యర్థులు – రూ.1180/- వరకు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST & PWD అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.. ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news