ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్.. ధర ఎంతో తెలుసా?

-

సాదారణంగా ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది..10,20 లేదా 100 ఎంత ఉన్నా కూడా అది మహా అయితే 1000, 2000 ఉంటుంది.. దానికే మనోళ్లు వామ్మో అంటున్నారు. ఐస్ క్రీమ్ కు ఇంత డిమాండ్ రావడానికి దాని రుచి కారణం అనే చెప్పాలి.ఒకప్పుడు సీజనల్గా కనిపించే ఈ ఐస్క్రీమ్లు ఇప్పుడు ఎవర్ గ్రీన్ గా మారిపోయాయి. నిత్యం అందరినీ ఆకర్షిస్తున్నాయి..ఒకప్పుడు సీజనల్గా కనిపించే ఈ ఐస్క్రీమ్లు ఇప్పుడు ఎవర్ గ్రీన్ గా మారిపోయాయి..

ఇక అసలు విషయానికొస్తే..అన్ని కాలాల్లో లభిస్తున్నాయి. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా డైరీ సంస్థలు నోరూరించే విభిన్న రకాల ఐస్క్రీమ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.ఫేమస్ ఐస్క్రీమ్ స్టోర్లలో వీటి ధర రూ.500, రూ.1000 పైగా ఉంటుంది. అయితే, ఒక స్కూప్ ఐస్క్రీమ్ ధర బంగారంతో సమానంగా ఉంటుందంటే నమ్మక తప్పదు. ఇంతలా ఉంటుందని ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చూశారా..న్యూయార్క్లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్ను అందిస్తున్నారు.

రెస్టారెంట్లో లభించే ఫ్రోజెన్ హాట్ చాక్లెట్ 25 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. ఇది ఇండియన్ కరెన్సీల్లో అక్షరాల రూ. 19 లక్షల 53 వేల కంటే ఎక్కువ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అటువంటి ఖరీదైన ఐస్ క్రీం 28 కోకోల మిశ్రమం నుంచి తయారు చేయబడింది. ఇందులో ప్రపంచంలోని 14 అత్యంత ఖరీదైన కోకో ఉన్నాయి. అదే సమయంలో, ఐస్ క్రీం పైన ఐదు గ్రాముల బంగారు తినేది కూడా ఉంచుతారు…

ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. వజ్రాలు పొదిగిన బంగారం స్పూన్ కూడా ఈ ఐస్‌క్రీమ్ తినడానికి అందింస్తారు. అయితే ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత ఈ డైమాండ్, గోల్డ్ స్పూన్ ఆ రెస్టారెంట్‌లోనే వదిలివేయకుండా ఇంటికి తీసుకెళ్లవచ్చు. న్యూయార్క్‌లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అందిస్తున్నాయి. దీని ధర 15,000 రూపాయలు, ఇది ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేస్తారు..అలా ఇది ఖరీధు అయ్యింది…ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news