రాష్ట్రంలో ఈ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయింది. తీవ్రమైన ఎండలతో నేడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ వెడి వాతావరణంలో చల్లటి కబురు వచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళ ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ నుంచి తమిళ నాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వివరించింది.
ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఎండలతో విసిగిపోయిన ప్రజలకు ఇదే చల్లటి వార్త అనే చెప్పాలి. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో చల్లటి వాతావరణం నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.