గుడ్ న్యూస్.. రూ. 10 లక్షలతో డిపాజిట్ చేస్తే..రూ.20 లక్షలు చేతికి..

-

డబ్బులను సేవ్ చెయ్యాలని చాలామంది అనుకుంటారు.. అయితే బయటవాటిలో పెట్టడం కన్నా బ్యాంకులలో దాచిపెట్టడం మేలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్ఒకటి అందబాటులో ఉంది. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు తమ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. మీరు ఈ బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు… దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. అందుకే మీరు డబ్బులు పెట్టేటప్పుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.. ఇందులో ఎక్కువ కాలం అంటే పదేళ్లు..రెండేళ్లు, మూడేళ్ల, ఐదేళ్లు ఇలా మీకు నచ్చిన టెన్యూర్ ఎంపిక చేసుకోవచ్చు. అధిక రాబడి కావాలంటే ఏ టెన్యూర్‌లో ఎక్కు వ వడ్డీ ఉందో చెక్ చేసుకొని ఆ టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు..3 నెలల నుంచి ఆరు నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఏడాది ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ రేటు ఉంది..

రెండేళ్ల టెన్యూర్‌ అయితే 7.26 శాతం దాకా వడ్డీ వస్తుంది. ఇంకా మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 7 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అదే సినియర్ సిటిజన్స్‌కు అయితే 8.01 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. రెండేళ్ల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. మూడేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌పై అయితే 7.75 శాతం వడ్డీ వస్తుంది..ఉదాహరణకు మీరు పదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. మీకు 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అంటే మీరు బ్యాంక్‌లో రూ. 10 లక్షల ఎఫ్‌డీ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 20 లక్షలకు వరకు లాభం పొందుతారు..అదే విధంగా సీనియర్ సిటిజన్స్ పేరుతో మీరు పదేళ్ల టెన్యూర్‌తో యాక్సిస్ బ్యాంక్‌లో ఎఫ్‌డీ ఖాతా తెరిస్తే.. మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి రూ.21 లక్షలకు పైగా పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news