ఫ్యాక్ట్ చెక్: రేషన్ కింద వీటిని ఇక ఇవ్వరా..? ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పింది నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచూ నకిలీ వార్తలు కనబడతాయి. నిజానికి ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం చాలా కష్టం. తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలం లో చాలా మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా నకిలీ వార్తలని తెగ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవే నిజమని చాలా మంది భావిస్తున్నారు.

తాజాగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా…? ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పినది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. టెక్నికల్ బ్లాక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో మర్చి 1, 2023 నుండి రేషన్ కార్డ్ హోల్డర్స్ కి గోధుములని ప్రభుత్వం ఇవ్వదని అందులో ఉంది ఆ వీడియోని ఇప్పటికి చాలా మంది షేర్ చేశారు.

ప్రస్తుతం అది వైరల్ గా మారింది మరి ఇంతకీ యూట్యూబ్ ఛానల్ చెప్పింది నిజమా కదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ప్రభుత్వం గోధుములని ఆపేయడం లేదు. కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్న వార్తలను నమ్మి అనవసరంగా మోసపోకండి తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news