రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్…!

-

అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరాకు పది వేల పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ఇవ్వనున్నారు. ఈ నెల 12 నుంచే వాటిని పంపిణీ చేయనున్నారు. గత నెలలో వడగండ్ల వానల వల్ల చాలా మంది రైతులు నష్ట పోయారు.

వీటికి సంబంధించి సీఎం కేసీఆర్‌కు నివేదికలు సమర్పించింది. పరిహారం పంపిణీ చేయాల్సిన తేదిని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బాధిత రైతులకు 12 తారీఖు నుంచి ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. రైతులకి ఎకరాకు పది వేల రూపాయల చొప్పున ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బాధిత రైతులకు చెక్కులు ఇవ్వనున్నారు. వర్షాల వలన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన పంటల్ని సీఎం కేసీఆర్ పరిశీలించి ఆ తరవాతే భరోసా ఇచ్చారు.

పంటతో సంబంధం లేకుండా ఎకరాకు రూ.10 వేల చొప్పున బాధిత రైతులందరికీ పరిహారం ఇస్తున్నట్టు హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికీ రైతులకు అందలేదని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిజానికి భారీ వర్షాలు, వడగండ్లు కురవటం, కొత్త సచివాలయ ప్రారంభం ఇలా పరిహారం ఇవ్వటం కాస్త ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కురిసిన వానల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఓ పదిహేను రోజులు పట్టనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news