ఐపీఎల్ 2023: రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ & షమీలే గుజరాత్ బలం !

-

గత రాత్రి ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ను గుజరాత్ టైటాన్స్ 9 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థాన్నాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజు శాంసన్ టీం ను స్పిన్నర్ల ద్వయం రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లు దారుణంగా దెబ్బ తీశారు. తమదైన లైన్ అండ్ లెన్త్ , గూగ్లీ మరియు రాంగ్ అన్ లతో రాజస్థాన్ ను ముప్పతిప్పలు పెట్టారు. వీరిద్దరూ ఈ మ్యాచ్ లో 7 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసుకున్నారు. ఈ వికెట్లలో పడిక్కల్, అశ్విన్, రియాన్ పరాగ్, హెట్ మెయిర్ మరియు ధృవ్ జురెల్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో వీరిదే పైచేయి అని చెప్పాలి…

రానున్న మ్యాచ్ లలో సైతం వీరిద్దరూ గుజరాత్ కు చాలా కీలకంగా మారుతారు. ఇక పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న మహమ్మద్ షమీ కూడా గుజరాత్ విజయాలకు కీలకంగా మారుతున్నాడు. గుజరాత్ బౌలింగ్ యూనిట్ లో వీరు ముగ్గురు రాణిస్తే ప్రతి మ్యాచ్ లో విజయం వీరిదే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news