TCS : భారత్​లో పనిచేయడానికి అత్యుత్తమమైన కంపెని ‘టీసీఎస్‌’

-

మన దేశంలో పని చేయడానికి అత్యుత్తమమైన కంపెనీ ఏదో తెలుసా..? ఇంకేది టీసీఎస్ అంట. ‘మన దేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో  అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ పొందింది. భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో ఈ జాబితాను లింక్డ్‌ఇన్‌ వెలువరించింది.

ఇ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌-ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. గతేడాది జాబితాలో టెక్‌ కంపెనీలు ఆధిపత్యం ప్రదర్శించగా.. ఈసారి ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్‌, నిపుణుల సేవలు, తయారీ, గేమింగ్‌ కంపెనీలు జాబితాలో ఎక్కువగా చోటు సాధించాయి. జాబితాలోని పలు అంశాలు ఇలా..

రాణించే సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, కంపెనీ స్థిరత్వం, విదేశీ అవకాశాలు, కంపెనీ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి అంశాల ఆధారంగా, కంపెనీలకు ఈ జాబితాలో లింక్డ్‌ఇన్‌ చోటు కల్పించింది. ఈ జాబితాలోని కంపెనీల్లో అత్యధికం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news