తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పీఆర్సీ అమలుపై కెసిఆర్ సర్కార్ మరో ముందడుగు వేసింది. రేపు జరుగనున్న తెలంగాణ కేబినెట్ ముందుకు పీఆర్ సీ అంశం రానుంది. ఈ సందర్బంగా ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. వేతన సవరణ పూర్తి నివేదికను సమర్పించిన ఆర్థిక శాఖ.. పీఆర్సీకి సంబంధించి రేపు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక గత అసెంబ్లీ సమావేశాలలో పిఆర్సీని సీఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతే కాదు రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్., రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాలపై సమీక్షించనున్నారు. అలాగే లాక్ డౌన్ సమయాన్ని ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ 10 నుంచి సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమలు చేసే యోచనలో ఉంది సర్కార్.