గోపీచంద్ “పక్కా కమర్షియల్” మూవీ ట్రైలర్ రిలీజ్

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్ ‘. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశికన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ-2 పిక్చర్స్- యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,టీజర్, మూవీ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. జూలై 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే.. సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. లాయర్ గా గోపీచంద్ డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచుతున్నాయి. కోర్టు నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version