విఘ్నేశ్‌-అజిత్‌ మూవీలో విలన్‌గా గౌతమ్ మేనన్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

-

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌కుమార్‌, నయనతారల కలయికలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమా గురించి ఓ వార్త జోరుగా ప్రచారమవుతోంది.

ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మేనన్‌ విలన్‌ పాత్రలో నటించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి చెక్‌ పెడుతూ గౌతమ్‌మేనన్‌ ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు. ‘‘విఘ్నేశ్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. అయితే ఈ సినిమాలోని పాత్ర గురించి నాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. నా దృష్టికి ఏ వార్త రాలేదు. ఒకవేళ విలన్‌ పాత్రకోసం నన్ను సంప్రదిస్తే నేను కచ్చితంగా ఒప్పుకొంటాను. ఎందుకంటే నాకు ప్రతినాయకుడిగా నటించడం ఇష్టం’’ అన్నారు.

అలాగే విజయ్‌తో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టాడు ఈ డైరెక్టర్‌. ‘‘చాలా కాలంగా విజయ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అతని వైపు నుంచి ఏమైనా అవకాశాలు వస్తే నేను నటిస్తాను.’’ అంటూ విజయ్‌తో నటించాలనే తన కోరికను చెప్పాడు గౌతమ్‌ మేనన్‌.

Read more RELATED
Recommended to you

Latest news