రాజ‌మౌళి ప్రేమ క‌థ ఇదే…!

-

సినిమా సినిమాకు ప‌రిణితి సాధించ‌డం
ఓ స‌వాలు సాహ‌సం కూడా
రాజ‌మౌళి అనే అగ్ర ద‌ర్శ‌కుడు నేర్చుకునేందుకు
ప్రాధాన్యం ఇస్తారు ఇత‌రుల‌కు నేర్పేందుకు త‌న వంతు కృషి చేస్తారు
సాధార‌ణ స్థాయి నుంచి ఎదిగివ‌చ్చిన ఆయ‌న అంద‌రినీ గౌర‌విస్తారు
కోపం త‌క్కువ ప్రేమ ఎక్కువ‌గా ఉండే ఈ సినిమా మ‌నిషి జీవితాన
కొన్ని ఆస‌క్తిదాయ‌క సంగ‌తులు.ట్రిపుల్ ఆర్ విడుద‌ల నేప‌థ్యాన

రాజమౌళి లవ్‌స్టోరీ గురించి
కొన్ని ఇంటరెస్టింగ్‌ ఫ్యాక్ట్స్…

ఎస్‌.ఎస్‌.రాజమౌళి. వరుస బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్‌. తెలుగు సినిమా దర్శకుల్లో మేటి దర్శక ధీరుడు. తెలుగు సినిమారంగమే కాదు మొత్తం భారతీయ చిత్రపరిశ్రమ అంతటికీ పరిచయం అక్కర్లేని పేరు దర్శక బాహుబలి. దర్శకుడిగా మొదటి టీవీ సీరియల్‌ శాంతినివాసం, మొదటి సినిమా స్టూడెంట్ నంబ‌ర్ 1కు దర్శకత్వం వహించిన దగ్గర నుంచి మొన్నటి బాహుబలి, ఈనాటి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు దర్శకుడిగా ఆయన పనితీరు, తన సినిమా విష‌య‌మై ఎలాంటి లోపమూ లేకుండా అన్ని విధాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే తపనే ఆయన్ను తెలుగు అగ్రదర్శకుల జాబితాలో చేర్చాయి. అందుకేనేమో ఆయనతో పనిచేసిన వారందరూ తనను ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుచుకుంటారు. అయితే ఆయన కెరీర్‌ను స్థూలంగా బాహుబలి ముందు– బాహుబలి తర్వాత అని చెప్పటమే కరెక్ట్‌.

ఇంకొంత క‌థ వెరీ ఇంట్రెస్టింగ్ …

ఎందుకంటే బాహుబలికి ముందువరకూ అతను ఓటమి ఎరుగని దర్శకుడు. కానీ తెలుగులో మాత్రమే కాదు అనువాదమైన అన్ని చోట్లా రికార్డుల మోత మోగించిన బాహుబలి సినిమా తర్వాత ఆయన దిగ్ ద‌ర్శకుడు. ఇప్పుడు మోస్ట్‌ పాపులర్‌ పాన్‌ ఇండియా డైరెక్టర్‌. ఇవన్నీ ఆయన కెరీర్‌కు సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు రాజమౌళి పర్సనల్‌ లైఫ్‌ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందామా..!

ప‌డ్డారండి ప్రేమ‌లో మ‌రి!

రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌. రాజమౌళి భార్య రమ సంగీతదర్శకుడు కీరవాణి భార్య వల్లికి సొంత అక్క. మొదటి భర్తతో విడాకుల తర్వాత కొడుకు కార్తికేయతో కలిసి ఉండేవారు రమ. బంధువులు కావడంతో చాలా సందర్భాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోగలిగే అలాగే అవకాశం, ఒకరి విషయాలు మరొకరు తెలుసుకునే సాన్నిహిత్యం కలిగింది.ఆ విధంగా ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పడ్డానండీ ప్రేమలో అని పాడుకున్నారు.

త‌న‌లో స‌గం 
ఆమే స‌ర్వం
ద‌టీజ్ రాజ‌మౌళి

పెద్దలకు చెప్పి చాలా సింపుల్‌గా ఎలాంటి ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా కలిసి జీవిస్తున్నారు. వీరు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమే ఎస్‌.ఎస్‌.మయూఖ. ఇక రాజమౌళి సినిమాలు, వాటి విజయాల వెనుక ఆయన కుటుంబం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. రమా రాజమౌళి, కార్తికేయ, కీరవాణి, ఆయన భార్య వల్లీ ఇలా వీరంతా సినిమాల విషయంలో రాజమౌళికి ఎంతో సహకారం అందిస్తారు.

అందుకే రాజమౌళి కూడా తన సినిమాల విజయంలో వారికీ భాగస్వామ్యం ఉందని, వారు లేకపోతే తాను లేననీ ఎన్నో సందర్భాల్లో ఎంతో భావోద్వేగంతో చెబుతారు. విశేషమేమిటంటే వీరిద్దరూ ఒకే ఏడాదిలో అంటే 1973లో పుట్టారు.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువభాగం సినిమాలకి ఈమే కాస్ట్యూమ్‌ డిజైనర్‌. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ట్రిపుల్ ఆర్ ఈ జంట‌కు మంచి పేరు తీసుకుని రావాల‌ని ఆశిస్తూ.. ఆ..ఇరువురికీ..ఆల్ ద బెస్ట్ ..

Read more RELATED
Recommended to you

Latest news