BREAKING : కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు

-

త‌మిళ్ స్టార్ న‌టుడు క‌మల్ హాస‌న్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది స్టాలిన్ ప్ర‌భుత్వం. తాజాగా నటుడు కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఓ టీవీ షోలో క‌మ‌ల్ హాస‌న్‌ పాల్గొనడం పై ఆగ్రహం వ్య‌క్తం చేసింది స్టాలిన్ స‌ర్కార్‌. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ ప్ర‌ముఖ‌ టీవీ షో లో పాల్గొన్నారు కమల్ హాసన్.

ఈ త‌రుణంలోనే… స్టాలిన్ స‌ర్కార్.. జాతీయ విప‌త్తుల చ‌ట్టం ప్ర‌కారం… క‌మ‌ల్ హాస‌న్ కు నోటీసులు జారీ చేసింది. న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌వంబ‌ర్ 22 వ తేదీన క‌రోనా మ‌హ‌మ్మారి భారీన ప‌డ్డారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్ ను చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో క‌రోనా చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ఆయ‌ను కుటుంబ స‌భ్యులు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందిన క‌మ‌ల్ హాస‌న్ …. రెండు రోజుల క్రితమే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news