హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంబంధించిన జమున ఆచారీస్ భూముల సర్వే పై వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. జమున హచరిస్ భూముల్లో సర్వే నంబర్ లో130,81 లో సిల్లిం గ్ భూములు అసైన్డ్ భూములను వున్నాయని స్పష్టం చేశారు. ఈ భూమాల్లో ఎస్సీ, ముదిరాజ్ వంజర వివిధ కమ్యూనిటి ఉన్నాయని…. 1974 ప్రకారం ఫాల్ట్రీ ఫామ్ కు పీసీవో పర్మీషన్ లేదని వెల్లడించారు.
అక్రమంగా, దౌర్జన్యంగా తీసుకున్న భూములను ప్రభుత్వ దృష్టి తీసుకుచ్చామని పేర్కొన్నారు కలెక్టర్. 56 మంది గల70 ఎకరాల 33 గుంటల భూములను దౌర్జంగా లాక్కున్నారని వివరించారు కలెక్టర్. అసైన్డ్ భూములలో ప్రలోభాలకు గురిచేశారని ఆ భూములు రిజిస్ట్రేషన్ కావని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేశారని… హల్దీ వాగు దగ్గర 97 సర్వ్ నంబర్ లో పాల్ట్రీకి సంబంధించిన వేశారని వెల్లడించారు.
జామున హాచరిస్ భూములు సంబంధించిన 70.33 గుంటలు అక్రమంగా దౌర్జన్యగా కబ్జా చేశారాని చెప్పారని కలెక్టర్. అచ్చం పేట గ్రామానికి చెందిన 56 కుటుంబాలకు చెందిన 70 ఎకరాల 33 గుంటలు భూమి కబ్జా జరిగిందన్నారు. భూమి హక్కుదారులు.. తమ భూమి కావాలని కోరారని…ఈ విషయాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేశామన్నారు.