యూనియన్ హెల్త్ మినిస్టరీ జారీ చేసిన కొత్త SOPs ఇవే…!

-

యూనియన్ హెల్త్ మినిస్టరీ ఈ కొత్త SOPs ప్రవేశ పెట్టడం జరిగింది. కరోనా వైరస్ మూలంగా ఆఫీసులో కొన్ని నిబంధనలు జారీ చేయడం జరిగింది. వీటి వివరాలను చూస్తే…. వర్క్ చేసే ప్రదేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తే ఆ బిల్డింగ్ లేదా బ్లాక్ ని ఇన్ఫెక్షన్ లేకుండా చేయాలి అన్నారు. అలానే కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ఆఫీసర్లు, వర్కింగ్ స్టాఫ్ సూపర్ వైజర్ కి చెప్పి ఆఫీస్ కి సెలవు పెట్టాలని అన్నారు. వాళ్లకి కేవలం వర్క్ ఫ్రొం హోమ్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పడం జరిగింది.

కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ఆఫీసులు మూసివేయాలి. కేవలం మెడికల్ మరియు అవసరమైన సేవలు కి మాత్రమే తెరవడానికి అనుమతి ఉంటుంది.

ఆఫీసులో పని చేసే వాళ్లు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి.

ఫేస్ కవర్స్ మరియు మాస్క్ లను తప్పక ఉపయోగించాలి. పూర్తిగా ముక్కు మరియు నోటిని మాస్క్ తో కవర్ చేసుకోవాలి.

మాస్క్ ఉన్న ప్రదేశంలో లేదా ముఖం దగ్గర పదేపదే తాకడం చేయకూడదు.

40 సెకండ్ నుంచి 60 సెకన్ల వరకు చేతిని శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. అలానే శానిటైజర్ ని 20 సెకన్ల పాటు చేతులపై వేసి క్లీన్ చేసుకోవాలని.

అందరూ కలిసి మీటింగ్ లు పెట్టుకోవడం కంటే వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగులు జరపాలని కోరారు.

అలానే ఎక్కువ మంది పార్కింగ్ ప్లేస్ లు, క్యాంటిన్లు వద్ద ఉంటే కరోనా వైరస్ వస్తుంది కనుక దూరంగా ఉండాలి.

వైరస్ స్ప్రెడ్ ని ఆపాలి. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్క ఆఫీస్ ముందున హ్యాండ్ శానిటైజర్ ని, థర్మల్ స్క్రీనింగ్ పెట్టాలి.

లిఫ్ట్ లో కూడా తక్కువ మందికే పరిమితం చేయాలి. ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళకూడదు.

అలానే ఎయిర్ కండిషనర్ ని ఉపయోగించినప్పుడు 24 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి. అలానే రిలేటివ్ హ్యూమిడిటీ 40 నుంచి 70 శాతం ఉండాలి.

ఎక్కువగా తాగే ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఆఫీస్ లో ఉండే ప్రతి షాపు ప్రతి ఏరియా అలానే క్యాంటీన్ వంటివి ప్రదేశాల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.

పనిచేసే ఉద్యోగులు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ… ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ అప్స్ చేయించుకుంటూ ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news