ఇటీవల ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని, లేదంటే నెక్స్ట్ సీటు ఇవ్వనని చెప్పిన జగన్ మాట…ఆయనకే ఇప్పుడు రివర్స్ అవుతుంది. అన్నీ జగన్ చేసుకుంటూ పోతే..తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు ఓపెన్ గా మాట్లాడే పరిస్తితి కనిపిస్తోంది. ఏపీలో ఏదైనా జరుగుతుందంటే అది పథకాలు అమలు అనే చెప్పాలి…సమయానికి జగన్ పథకాలు అందించేస్తున్నారు. ఇంకా ఏ ఇతర అభివృద్ధి పనులపై జగన్ పెద్దగా ఫోకస్ చేసినట్లుగాని, నిధులు ఖర్చు పెట్టినట్లు గాని కనబడటం లేదు. ఏదో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు..నాడు-నేడు ద్వారా పాఠశాలలని బాగుచేయడం చేశారు..ఇవి కూడా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగానే ఉన్నాయి.
అంటే పథకాల పైనే జగన్ ఫోకస్..పైగా కింది స్థాయిలో వాలంటీర్లు…పథకాలు ఎవరికి చేరాలో నిర్ణయిస్తున్నారు…ఇటు సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి పథకాల సొమ్ముని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తున్నారు. మరి మధ్యలో ఎమ్మెల్యేలు చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఇదే విషయంపై దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్…డైరక్ట్ గానే ఎమ్మెల్యేలకు ఉన్న బాధని చెప్పుకొచ్చారు. జగన్ బటన్ నొక్కి డబ్బులు వేస్తే…ఆయన గ్రాఫ్ పెరుగుతుంది తప్ప..తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని అంటున్నారు.
గడప గడపకు వెళుతుంటే ప్రజలు పథకాలు సరే…రోడ్లు ఎక్కడ? తాగునీరు ఎక్కడ? డ్రైనేజ్ లు కట్టరా? అని ప్రశ్నిస్తున్నారని, వాటికి నిధులు ఇస్తే కాస్త ప్రజలకు పనిచేసి పెట్టి గ్రాఫ్ పెంచుకుంటామని అంటున్నారు. అలాగే అధికారంలోకి రాగానే సొంత పార్టీ కార్యకర్తలకు అనేక కాంట్రాక్టులు ఇప్పించామని, కానీ ఇంతవరకు బిల్లులు రాలేదని, దాని వల్ల కార్యకర్తలు అప్పులు పాలైపోయారని చెబుతున్నారు.
అంటే ఇప్పుడు జగన్ వల్లే తమ గ్రాఫ్ పెరగడం లేదని ఎమ్మెల్యేలు పరోక్షంగా మాట్లాడుతున్నారు…ఇప్పటికే వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది..ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు..జగన్ పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని బట్టి చూస్తే వైసీపీకి కష్టాలు ఇంకా పెరిగేలా ఉన్నాయి…చివరికి జగన్ కే నష్టం జరిగేలా ఉంది.