ఈనెల 25 నుంచి గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష శిక్షణ

-

తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌ స్టడీ కేంద్రాల పరిధిలో ఈ నెల 25 నుంచి మూడు నెలల పాటు ప్రధాన పరీక్ష శిక్షణ తరగతులుంటాయని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ స్టడీ సెంటర్లలో వంద మంది చొప్పున, హైదరాబాద్‌ స్టడీ సెంటర్‌లో 200 మంది.. మొత్తం 500 మందికి శిక్షణ ఇస్తామని వివరించారు. ఇప్పటికే స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు నేరుగా ప్రధాన పరీక్ష శిక్షణకు హాజరు కావాలని, శిక్షణ తీసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వీరిలో మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతి అభ్యర్థికి మూడు నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున స్టయిపెండ్‌, స్టడీ మెటీరియల్‌ అందిస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 15 బీసీ స్టడీ సర్కిళ్లు, స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 182 మంది గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు అర్హత సాధించారని అలోక్‌ కుమార్‌ తెలిపారు.

గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనకు గురువారం సాయంత్రానికి 5.31 లక్షల మంది దరఖాస్తు చేశారు. గ్రూప్‌-2 పోస్టులకు రెండు రోజులకు కలిపి దరఖాస్తుల సంఖ్య 42,100 దాటింది.

Read more RELATED
Recommended to you

Latest news