గ్రూప్ – 1 ప్రిలిమిన‌రీ ఫైనల్ కీ విడుద‌ల‌..ఇలా చెక్ చేసుకోండి

-

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ ఫైనల్‌ కీ ని తెలంగాణ పబ్లీక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం అర్థరాత్రి రిలీజ్‌ చేసింది. సోమవారం నాంపల్లి లోని టీఎస్‌ పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ అభ్యంతరాలపై చర్చించింది.

అనంతరం మంగళవారం కీ ని రిలీజ్‌ చేశారు. ఫైనల్‌ కీ కోసం www.tspsc.gov.in అనే వెబ్‌ సైట్‌ ను సందర్శించవచ్చు. ఈ ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అదే నెల 29వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేశారు. అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news